Friday, 13 November 2015

Krishnam Raju Fires On Prabhas Marriage Rumors


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం వచ్చే ఏడాది చేసుకుంటా అంటూ గత 5, 6 ఏళ్ల నుంచి చెబుతూనే వున్నాడు. కానీ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో ఇక ప్రభాస్ పెళ్లి ఎలా వుండాలో, ఎలాంటి అమ్మాయి అయితే ప్రభాస్ సరైన జోడి అవుతుందో అభిమానులే ఖరారు చేసేస్తున్నారు.

మొన్నటి వరకు ప్రభాస్ కు అనుష్క అయితేనే సరైన జోడి అంటూ వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నటిని కూడా చేసుకోడని తెలియడంతో.. ఇక ప్రభాస్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లోని అమ్మాయిలలో ప్రభాస్ కు జోడిని సెట్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. గతకొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకే ఆమె పెళ్లికి సంబంధించిన షాపింగ్ లో బిజీగా వున్నారంటూ వార్తలొచ్చాయి

ఈ వార్తలపై ప్రభాస్ పెద్దనాన్న, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ కూడా బేస్ లెస్ రూమర్స్ అంటు కొట్టిపారేసారు. ఈ పుకార్లను ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఒకవేళ ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయితే మేమే మొదటగా మీడియా ద్వారా అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ స్పష్టం చేసారు.

ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి2’ కోసం తన బాడీని పెంచుకునే ప్రయత్నంలో మళ్లీ జిమ్ లో బిజీగా వున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అనే విషయం భవిష్యత్తులోనే తెలియనుంది.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70152-krishnam-raju-fires-on-prabhas-marriage-rumors.html

Tuesday, 10 November 2015

Sharwanand Express Raja Movie Teaser


‘రన్ రాజా రన్’ వంటి హిట్ చిత్రం తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇందులో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌,సుర‌భి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ఉర్వ‌శి, ప్ర‌భాస్ శీను, సుప్రీత్‌, స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, దువ్వాసి, బండ ర‌ఘు, నాగినీడు, సుర్య త‌దిత‌రులు న‌టించారు..
సాంకేతికనిపుణులు.. కెమెరా-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని, సంగీతం-ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌- ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌- స‌త్య‌.జి, డాన్స్‌- రాజుసుంద‌రం, రఘు, స్టంట్స్‌-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్‌-తోట భాస్క‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మెద్‌, ద‌ర్శ‌క‌త్వం- మేర్ల‌పాక గాంధి

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70037-sharwanand-express-raja-movie-teaser.html

Balakrishna Dictator Film Release On Pongal 2016


నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘’సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లోనూ విడుదల చేయాలని మా సంకల్పానికి బాలయ్యగారు పూర్తి సహాయ సహాకారాలందిచారు. ప్రతి క్షణం ఆయన అందించిన మద్దతుతోనే సినిమా షూటింగ్ చాలా కూల్ గా ఎటువంటి ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతుంది. అలాగే సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రెండు పాటలు, రెండు ఫైట్స్, డిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబ‌ర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

సుమన్, పవిత్రా లోకేష్, నాజర్, వెన్నెలకిషోర్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రంజీత్, అజయ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోనవెంకట్-గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ఇంటర్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70058-balakrishna-dictator-film-release-on-pongal-2016.html

Monday, 9 November 2015

సారీ చెప్పి బతికి బయటపడ్డ ఆలీ


తెలుగు సినీ నటుడు, కమెడీయన్ ఆలీపై మహిళా సంఘాలు గోల గోల చేస్తున్నాయి. ఆలీ గతకొద్ది కాలంగా ఆడవాళ్లను చులకనగా చూస్తూ, వారిపై చెత్త చెత్త కామెంట్లు చేస్తున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఆలీ తన నోటి దురుసును ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు.

ఇటీవలే ‘సైజ్ జీరో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో అనుష్క తొడలపై ఆలీ చెత్తగా కామెంట్లు చేయడంతో మళ్లీ ఆలీ హాట్ టాపిక్ గా మారిపోయాడు. గతంలో ఎవరో ఒకరో, ఇద్దరో ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎవరేమి పట్టించుకోలేదు. కానీ ఇపుడు మహిళా సంఘాలు ఏకమై ఆలీకి బుద్ధిచెప్పాలని ప్రయత్నంలో వున్నట్లుగా తెలిసింది.

ఇటీవలే ఆలీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ హోటల్లో దిగాడని తెలుసుకున్న మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అక్కడికి వెళ్లి ధర్నా చేసారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం, ద్వందార్థాలతో అగౌరవపరుస్తున్నాడంటూ వారు ఆరోపిస్తూ, ఆలీకి వ్యతిరేకంగా నిరసనలు చేసారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరి, ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోగా ఆలీ తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా ప్రకటించడంతో వారు శాంతించారు. మరి ఆలీ ఇదే విధంగా అసభ్యకరంగా మాట్లాడితే మహిళా సంఘాలు మరింత తీవ్రంగా స్పందించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తున్నాయి.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70026-ali-responds-to-his-comments-on-anushka-thighs.html

విడుదలకు ముందే సినిమా రిలీజ్.. టాక్ అదుర్స్


అక్కినేని అభిమానులకు దీపావళికి ముందే ఓ పండగ లాంటి వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా ఈనెల 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా వారం రోజుల ముందే విడుదలయినట్లుగా సమాచారం.

దీపావళి రోజున నవంబర్ 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ రోజున అమావాస్య కావడంతో ‘అఖిల్’ సినిమాను గత శుక్రవారం(నవంబర్6) రోజునే అక్కినేని కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అంతా కలిసి ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి మరీ ‘అఖిల్’ సినిమా వీక్షించారట. సినిమా సూపర్బ్ అంటూ చూసిన వాళ్లంతా చెబుతున్నారట.

కానీ చూసిన వారంతా కూడా అక్కినేని కుటుంబ సభ్యులు, ఆత్మీయులే కాబట్టి వారి టాక్ ను నమ్మలేం. కానీ తాజా సమాచారం ప్రకారం ‘అఖిల్’ సినిమా పైసా వసూల్ సినిమాని తెలిసింది. అఖిల్ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అదరగొట్టేసాడని సమాచారం. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం టాక్ పూర్తిగా పాజిటివ్ గా వుండటంతో అభిమానులు సంతోషంగా వున్నారు.

సినిమా విడుదలై మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ సంగీతం అందించాడు.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70027-akhil-movie-pre-release-talk-hit.html