Monday, 9 November 2015

సారీ చెప్పి బతికి బయటపడ్డ ఆలీ


తెలుగు సినీ నటుడు, కమెడీయన్ ఆలీపై మహిళా సంఘాలు గోల గోల చేస్తున్నాయి. ఆలీ గతకొద్ది కాలంగా ఆడవాళ్లను చులకనగా చూస్తూ, వారిపై చెత్త చెత్త కామెంట్లు చేస్తున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఆలీ తన నోటి దురుసును ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు.

ఇటీవలే ‘సైజ్ జీరో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో అనుష్క తొడలపై ఆలీ చెత్తగా కామెంట్లు చేయడంతో మళ్లీ ఆలీ హాట్ టాపిక్ గా మారిపోయాడు. గతంలో ఎవరో ఒకరో, ఇద్దరో ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎవరేమి పట్టించుకోలేదు. కానీ ఇపుడు మహిళా సంఘాలు ఏకమై ఆలీకి బుద్ధిచెప్పాలని ప్రయత్నంలో వున్నట్లుగా తెలిసింది.

ఇటీవలే ఆలీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ హోటల్లో దిగాడని తెలుసుకున్న మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అక్కడికి వెళ్లి ధర్నా చేసారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం, ద్వందార్థాలతో అగౌరవపరుస్తున్నాడంటూ వారు ఆరోపిస్తూ, ఆలీకి వ్యతిరేకంగా నిరసనలు చేసారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరి, ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోగా ఆలీ తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా ప్రకటించడంతో వారు శాంతించారు. మరి ఆలీ ఇదే విధంగా అసభ్యకరంగా మాట్లాడితే మహిళా సంఘాలు మరింత తీవ్రంగా స్పందించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తున్నాయి.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70026-ali-responds-to-his-comments-on-anushka-thighs.html

No comments:

Post a Comment